వాదనలను విన్నాకే రఘురామపై నిర్ణయం

ప్రధానాంశాలు

వాదనలను విన్నాకే రఘురామపై నిర్ణయం

రన్నింగ్‌ కామెంట్రీ చేయలేం
అనర్హత ఫిర్యాదులపై స్పీకర్‌ ఓం బిర్లా

ఈనాడు, దిల్లీ: పార్టీ ఫిరాయింపులు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదులపై సభా నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటుకోసం వైకాపా ఇచ్చిన ఫిర్యాదును విలేకరులు ప్రశ్నించగా.. సభాపతి పైవిధంగా స్పందించారు.

‘నా ముందుకు ఏ పిటిషన్‌ వచ్చినా తొలుత మా సచివాలయం పరిశీలిస్తుంది. నిర్ణయం తీసుకొనేంత వరకూ ఆ విషయాన్ని బహిర్గతంగా వెల్లడించలేం. ఇది సభా కార్యకలాపాల్లో అంతర్భాగం. సభా నియమాలు, విధాన పరమైన ప్రక్రియలు అనుసరిచాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే ప్రొసీడింగ్స్‌ మొదలవుతాయి. ప్రొసీడింగ్స్‌ పూర్తికానంత వరకు నిర్ణయం తీసుకోవడం సాధ్యంకాదు. సభా కార్యకలాపాల తరహాలో ఈ విషయంపై రన్నింగ్‌ కామెంట్రీ చేయలేం’ అని వివరించారు. ‘ఫిరాయింపులపై నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం ఉంది. గతంలో స్పీకర్ల సదస్సులోనూ చర్చించాం. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత తదనుగుణంగా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని