నేతన్న నేస్తం లబ్ధిదారుల్లో కోత

ప్రధానాంశాలు

నేతన్న నేస్తం లబ్ధిదారుల్లో కోత

అనర్హుల జాబితాలోకి 10 వేల మంది

ఈనాడు, అమరావతి: సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఆర్థిక భరోసాగా ఇస్తున్న నేతన్న నేస్తం సాయానికి ప్రభుత్వం కోత పెట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధిపొందిన పలువురు చేనేత కార్మికులను ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సాయం పొందుతున్నారని అనర్హుల జాబితాల్లో చేర్చారు.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా యాభై వేల మంది వరకు చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత మగ్గం ఏర్పాటు చేసుకున్న వారికే నేతన్న నేస్తం పథకాన్ని వర్తింప జేసింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.24 వేలు సాయం అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి రెండు విడతలుగా రూ.24 వేల చొప్పున అందించింది. మూడో విడత సాయానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలను మరోసారి ప్రభుత్వం తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది వరకు లబ్ధిదారులకు వివిధ పథకాల కింద సాయం అందడం ఇతర కారణాలతో అనర్హుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీటిని ఇప్పటికీ సచివాలయాల్లో ప్రదర్శించారు. రెండు విడతలుగా సాయం పొందిన వారి పేర్లు సైతం అనర్హుల జాబితాలో ఉండటంతో వారు సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా, వృద్ధాప్య, వితంతు పింఛన్లు పొందటం, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఆదాయ పన్ను చెల్లించినట్లు గుర్తించి అనర్హులుగా ప్రకటించారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని