స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ప్రధానాంశాలు

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 74,820 నమూనాలను పరీక్షించారు. 2,174 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. పాజిటివిటీ రేటు 2.9%గా నమోదైంది. ఈ నెల 22, 23 తేదీల్లో పాజిటివిటీ రేటు 2.6% చొప్పున నమోదైంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 418 కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లాలో 329, కృష్ణా 248, నెల్లూరు 246, ప్రకాశం 233, పశ్చిమగోదావరి జిల్లాలో 209 చొప్పున కేసులు రికార్డయ్యాయి. తక్కువగా కర్నూలు జిల్లాలో 9, విజయనగరం 29, శ్రీకాకుళం 63, అనంతపురం 67, కడప జిల్లాలో 89 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 18 మంది ప్రాణాలు విడిచారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు 4, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, పశ్చిమగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 2,737 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,40,50,103 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా 19,52,513 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 19,16,914 మంది కోలుకున్నారు. 22,358 మంది చికిత్స పొందుతున్నారు. 13,241 మంది మరణించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని