ధాన్యం బకాయిల చెల్లింపు

ప్రధానాంశాలు

ధాన్యం బకాయిల చెల్లింపు

రబీ సేకరణకు తాజాగా రూ.922.19 కోట్ల విడుదల
ఇప్పటివరకు ఇచ్చింది మొత్తం రూ.6344.93 కోట్లు

ఈనాడు, అమరావతి: రబీ ధాన్యం సేకరణ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం బుధవారం రూ.922.19 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో జులై 28 నాటికి మొత్తం రూ.6,634.63 కోట్ల విలువైన 35,43,909 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో ఇప్పటివరకు మొత్తం రూ.6,344.93 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.289.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లాల్లో అప్‌లోడ్‌ చేయగానే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. చెల్లింపులకు సరిపడ నగదు పౌరసరఫరాల సంస్థ వద్ద అందుబాటులో ఉందని పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని