గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీ జాబితాలో అమరావతి

ప్రధానాంశాలు

గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీ జాబితాలో అమరావతి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన 5 గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కూడా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ బుధవారం రాజ్యసభలో తెలిపారు. ‘రాష్ట్రాల్లో కొత్త నగరాల నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం రూ.8 వేల కోట్ల పెర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ను సిఫార్సు చేసింది. ఈ పథకం కింద ఒక్కో రాష్ట్రం ఒక కొత్త నగరాన్ని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ నగరానికి రూ.వెయ్యి కోట్లు అందుతాయి. ఐదేళ్లలో మొత్తం 8 నగరాలు ఈ నిధిని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం విధివిధానాలు ఇంకా ఖరారు చేయలేదు. 2015లో ప్రారంభించిన స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌లో నగరాలను మెరుగుపరచడం (రెట్రోఫిటింగ్‌), నవీకరణ (రీడెవలప్‌మెంట్‌), నగర విస్తరణ (గ్రీన్‌ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌) కీలక అంశాలు. 2016 నుంచి 2018 మధ్య 100 నగరాలను ఈ మిషన్‌ కింద ఎంపికచేశాం. అందులో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీల జాబితాలో రాంచీ, ఔరంగాబాద్‌, రాజ్‌కోట్‌, అమరావతి, సాత్నాలు ఉన్నాయి. రెట్రోఫిటింగ్‌+ గ్రీన్‌ఫీల్డ్‌ నగరాల జాబితాలో న్యూటౌన్‌ కోల్‌కత్తా, నాశిక్‌, అటల్‌నగర్‌ ఉన్నాయి’ అని మంత్రి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని