కర్ణాటక నూతన సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం

ప్రధానాంశాలు

కర్ణాటక నూతన సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సరిగ్గా 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ నూతన ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప, కేంద్ర పరిశీలకులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌ రెడ్డి, భాజపా నాయకురాలు డి.కె.అరుణ్‌ తదితరులు హాజరయ్యారు. ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులతో వరదలపై సమీక్షించారు. అధిష్ఠానంతో చర్చల అనంతరం ఉపముఖ్యమంత్రి పదవుల సృష్టి, మంత్రివర్గ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని, త్వరలో దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతానని బొమ్మై వెల్లడించారు. ముఖ్యమంత్రి బొమ్మైకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనల సందేశం పంపారు. సీఎం అంచనాలకు మించి ఉత్తమ పాలన అందిస్తారని ట్వీట్‌ చేశారు. యడియూరప్ప రాజీనామా చేసినా కొత్త సర్కారుకు ఆయన సేవలు ఎంతో అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని