తెలుగురాష్ట్రాల్లో డెల్టాప్లస్‌ ఆనవాళ్లు

ప్రధానాంశాలు

తెలుగురాష్ట్రాల్లో డెల్టాప్లస్‌ ఆనవాళ్లు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా డెల్టాప్లస్‌ కరోనా కేసులు 70 దాకా వెలుగుచూసినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 2 కేసుల చొప్పున కనిపించినట్లు వెల్లడించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10 డెల్టాప్లస్‌ కేసులు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో 4, కేరళ, కర్ణాటకల్లో మూడు చొప్పున, అయిదు రాష్ట్రాల్లో రెండేసి, మరో ఆరు రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున కనిపించినట్లు తెలిపారు. ఈనెల 22 నాటికి దేశవ్యాప్తంగా 58,240 నమూనాల జన్యు పరిణామక్రమాన్ని వేరు చేసినట్లు చెప్పారు. ఇందులో డెల్టా రకం 17,169 నమూనాల్లో బయటపడినట్లు తెలిపారు. అల్ఫా 4,172, బీటా 217, గామా 1 నమూనాలో కనిపించినట్లు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని