సెప్టెంబరు 19న ఏపీఈసెట్‌

ప్రధానాంశాలు

సెప్టెంబరు 19న ఏపీఈసెట్‌

అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశించడానికి నిర్వహించే ఏపీఈసెట్‌-2021ను ఏడోసారి అనంతపురం జేఎన్‌టీయూ నిర్వహిస్తోందని ఈసెట్‌ ఛైర్మన్‌, వీసీ రంగజనార్దన, కన్వీనరు శశిధర్‌ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఈ నెల 12  వరకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 19న పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తామని చెప్పారు. ఏపీలో 48, తెలంగాణలో 3 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. గత సంవత్సరం 37,167 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సంవత్సరం ఇప్పటికే 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్‌లో 12, ఫార్మసీలో 1, బీఎస్సీ గణితం 1 బ్రాంచిల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలను https://sche.ap.gov.in.ecet ద్వారా తెలుసుకోవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని