పెసరవాయి అన్నదమ్ముల హత్యకేసులో నిందితుల్ని అరెస్టు చేయండి

ప్రధానాంశాలు

పెసరవాయి అన్నదమ్ముల హత్యకేసులో నిందితుల్ని అరెస్టు చేయండి

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు,అమరావతి: కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో సోదరులు వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాప్‌రెడ్డిల హత్య కేసులో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు, సాక్షులకు, ఫిర్యాదుదారులకు రక్షణ కల్పించాలని కోరుతూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘పెసరవాయిలో ఈ ఏడాది జూన్‌ 17న ఉదయం 6.45 గంటలకు ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. తమ తమ్ముడు వడ్డు మోహన్‌రెడ్డికి నివాళి అర్పించేందుకు వెళ్తున్న సమయంలో నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిని హత్య చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పక్కా సాక్ష్యాలు ఉన్నా.. దోషులను అరెస్టు  చేయలేదు. వారంతా బయటే తిరుగుతూ.. బాధిత కుటుంబ సభ్యులు, సాక్షులను బెదిరిస్తున్నారు. ఫోన్‌ ద్వారా, భౌతికంగా బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసులతో కుమ్మక్కై వారి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని