సీబీఏఎస్‌ పరీక్షలుండవు

ప్రధానాంశాలు

సీబీఏఎస్‌ పరీక్షలుండవు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషనరీ ఖరారు కోసం నిర్వహించే పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. శాఖాపరమైన పరీక్షలతోపాటు క్రెడిట్‌ బేసిడ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌ (సీబీఏఎస్‌) పరీక్షలను నిర్వహించి ఉద్యోగులకు ప్రొబేషనరీని ఖరారు చేయాలని నిర్ణయించిన గ్రామ, వార్డు సచివాలయాలశాఖ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రొబేషనరీ ఖరారుకు ఏపీపీఎస్సీ నిర్వహించే శాఖాపరమైన పరీక్షలు మినహా ఎలాంటి ఇతర అదనపు పరీక్షలు ఉండబోవని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ స్పష్టం చేశారు. ‘ప్రొబేషనరీ విషయంలో ఉద్యోగులు ఎలాంటి భయాలూ పెట్టుకోవద్దు. సీబీఏఎస్‌ పరీక్షలను నిర్వహించం. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులంతా కేవలం శాఖాపరమైన పరీక్షలు పాసైతే చాలు’ అని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని