జయహో సింధు

ప్రధానాంశాలు

జయహో సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో అదరగొట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలతో మెరిసిన సింధు బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌, శాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, ఎయిర్‌పోర్ట్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికి సత్కరించారు. సింధుతో పాటు ఆమె కోచ్‌ పార్క్‌ను మంత్రి అభినందించారు.

  - న్యూస్‌టుడే, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని