కొవిడ్‌ ముందు మాదిరే ప్రయాణించొచ్చు

ప్రధానాంశాలు

కొవిడ్‌ ముందు మాదిరే ప్రయాణించొచ్చు

జనరల్‌ బోగీ ప్రయాణానికి ఇక రిజర్వేషన్‌ అక్కర్లేదు

ఈనాడు, హైదరాబాద్‌: రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ఇక కొవిడ్‌కు ముందు మాదిరే ప్రయాణం చేయవచ్చు. రిజర్వేషన్‌ అవసరం లేదు. స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌ కౌంటర్లలో అన్‌రిజర్వుడ్‌ టికెట్‌ తీసుకుని రైలెక్కి ప్రయాణం చేయవచ్చు. ఈ నిర్ణయం 24 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందని అయితే హైదరాబాద్‌ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం తెలిపింది. జోన్‌ పరిధిలోని 74 రైళ్లలో జనరల్‌ బోగీలను రిజర్వేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్‌ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని