ఇద్దరు ఏపీ మహిళలకు నైటింగేల్‌ అవార్డులు

ప్రధానాంశాలు

ఇద్దరు ఏపీ మహిళలకు నైటింగేల్‌ అవార్డులు

వీసీ ద్వారా అందించిన రాష్ట్రపతి

ఈనాడు, దిల్లీ; భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: ఉత్తమ వైద్య సేవలు అందించిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు ప్రదానం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి చెందిన డి.రూపకళ, శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలోని నర్సింగ్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమ్ములూరు పద్మజ ఈ అవార్డులను ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలన్న భారతీయ సంప్రదాయాలకు నర్సుల పనితీరు అద్దంపడుతుందన్నారు. కొవిడ్‌-19 సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా నర్సులు సాహసోపేతమైన సేవలు అందించారని కొనియాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని