డిగ్రీలో తెలుగు మాధ్యమం కనుమరుగు

ప్రధానాంశాలు

డిగ్రీలో తెలుగు మాధ్యమం కనుమరుగు

అన్ని డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని కళాశాలల్లోనూ అమలు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు అందుబాటులో ఉండగా.. ఈ ఉత్తర్వులతో తెలుగు మాధ్యమం కనుమరుగుకానుంది. విద్యార్థులందరూ ఆంగ్ల మాధ్యమంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో 2,62,805 మంది ప్రవేశాలు పొందగా.. వీరిలో 65,701 (25%)మంది తెలుగు మాధ్యమంలో చేరారు. తెలుగు మాధ్యమంలో చేరిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యం వారే ఉన్నారు. తెలుగులో ప్రవేశాలు పొందిన వారిలో ఎస్సీలు 24%, ఎస్టీలు 10%, ఓసీలు 11%, బీసీలు 55% ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం నిర్ణయంతో వీరందరూ తమ అవకాశాన్ని కోల్పోనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని