ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ప్రధానాంశాలు

ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రోజుకు 15వేల నుంచి 20వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. మరికొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల విడుదల కార్యక్రమం సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి టోకెన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం జియో సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు ‘అదివో అల్లదివో’ పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లోని యువతకు పోటీలు నిర్వహించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలను ఆయన ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదట జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువతకు పోటీలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు ఔత్సాహికులు ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లోగానీ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని