25న జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నిక

ప్రధానాంశాలు

25న జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నిక

ఈనాడు, అమరావతి: జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు ఎస్‌ఈసీ ఆదివారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.  

జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు సంబంధించి విజేతలైన జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం ఈ నెల 21న నోటీసులు ఇస్తారు. 25నే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక నిర్వహిస్తారు. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను, కో-ఆప్షన్‌ సభ్యులను జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏ కారణంగానైనా 25న ఎన్నికలు నిర్వహించలేకపోతే 26న పూర్తి చేస్తారు.

మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, మైనారిటీ వర్గానికి చెందిన ఒక కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికకు సంబంధించి విజేతలైన ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశం నిర్వహణకు సోమవారం నోటీసులు జారీ చేస్తారు. ఈ నెల 24న అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించి, పరిశీలిస్తారు. అదే రోజు ఎన్నిక నిర్వహిస్తారు. 24న ఎన్నికలు నిర్వహించలేక పోతే 25న పూర్తి చేస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని