జైలు నుంచి సాంబశివరావు విడుదల

ప్రధానాంశాలు

జైలు నుంచి సాంబశివరావు విడుదల

ఈనాడు, అమరావతి: ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్టయి మచిలీపట్నం ఉపకారాగారంలో ఉన్న ఐఆర్‌టీఎస్‌ అధికారి సాంబశివరావు మంగళవారం విడుదలయ్యారు. ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు సంబంధించి ఆయన్ను ఇటీవల సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. సాంబశివరావు తరఫు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ విజయవాడలోని అనిశా న్యాయస్థానంలో పూచీకత్తు సమర్పించారు. అనంతరం బెయిల్‌ ఉత్తర్వులను తీసుకుని మచిలీపట్నంలోని ఉపకారాగారంలో అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని