ఇద్దరు మీడియా ప్రతినిధులను విచారించిన సీబీఐ

ప్రధానాంశాలు

ఇద్దరు మీడియా ప్రతినిధులను విచారించిన సీబీఐ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో మంగళవారం సీబీఐ అధికారులు ఇద్దరు ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను విచారించారు. జమ్మలమడుగు కోర్టులో వివేకానందరెడ్డి ఇంటి కాపలాదారు రంగన్న వాంగ్మూలాన్ని సీబీఐ తీసుకున్న విషయం తెలిసిందే. హత్య జరిగిన రోజు తాను ఇద్దరిని చూసినట్లు వాంగ్మూలంలో రంగన్న చెప్పినట్లు సమాచారం. అప్పట్లో పలు ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో రంగన్న వాంగ్మూలానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ ఇద్దరు ఎవరంటూ మీడియా ప్రతినిధులు కొన్ని ఊహాచిత్రాలను ప్రసారం చేశారు. ఆ ఊహాచిత్రాలు ఎవరివని ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను విచారించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని