ఎగుమతుల లక్ష్యాల కోసం నాలుగంచెల ప్రణాళిక

ప్రధానాంశాలు

ఎగుమతుల లక్ష్యాల కోసం నాలుగంచెల ప్రణాళిక

నోడల్‌ ఏజెన్సీగా ఏపీటీపీసీ

ఈనాడు, అమరావతి: దేశంలోని మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర ఎగుమతులు 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి నాలుగంచెల ప్రణాళికను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఎగుమతుల ప్రణాళిక-2021ని మంగళవారం నిర్వహించిన వాణిజ్య ఉత్సవ్‌లో సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు వివిధ శాఖలతో సమన్వయానికి రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఏపీటీపీసీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ప్రణాళికలో ముఖ్యాంశాలు..

లక్ష్యాల సాధన కోసం..

* రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు, ప్రత్యేక గుర్తింపు ఉన్నవాటి ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎగుమతుల రంగంలో కొత్తవారిని ప్రోత్సహించాలి. దీనికోసం వారికి ఆర్థిక సహకారం, యంత్రాలు, ముడిపదార్థాలను అందుబాటులో ఉండేలా చూడాలి.
* మత్స్య, సేంద్రియ ఎరువులు, ఫార్మా, ఇనుము, ఓడల నిర్మాణం, ధాన్యం, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ఆటోమోబైల్‌, ఇమిటేషన్‌ జ్యూయలరీ రంగాల్లో ఎగుమతులను పెంచుకోవడానికి ఆస్కారం ఉందని ప్రభుత్వం గుర్తించింది.
* గార్మెంట్స్‌, గ్రానైట్‌ స్టోన్‌, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఆహారశుద్ధి పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులకు అదనపు విలువను జోడించాలని ప్రతిపాదించింది.
* గుంటూరు మిరప, కొండపల్లి బొమ్మలు, చిత్తూరు మామిడి పల్ప్‌, శ్రీకాకుళం జీడిపప్పు, విశాఖ, కాకినాడ, విజయనగరం బల్క్‌ డ్రగ్స్‌, నెల్లూరు, పశ్చిమగోదావరి మత్స్య ఉత్పత్తులు.. ఇలా జిల్లాల్లో ప్రధాన ఉత్పత్తులను ప్రభుత్వం గుర్తించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని