రూ.10కే స్థలం రిజిస్ట్రేషన్‌

ప్రధానాంశాలు

రూ.10కే స్థలం రిజిస్ట్రేషన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి పట్టా మాత్రమే తీసుకుని రుణాలు తీసుకోకుండా లబ్ధిదారులే అక్కడే ఉంటే ఆ స్థలాన్ని జగనన్న శాశ్వత గృహ హక్కు(ఓటీఎస్‌) పథకం కింద రూ.10లతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. పట్టా తీసుకున్న వారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మి...అక్కడ ఇతరులు ఇల్లు కట్టుకుంటే అలాంటి వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పురపాలక సంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అదే పట్టా తీసుకుని వారే గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకుని ఆ తర్వాత దానిని వేరే వాళ్లకు అమ్మేసి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పురపాలక సంఘాల్లో రూ.30 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా అమలు చేయనున్నామన్నారు. వెంటనే దీనికి సంబంధించిన డేటాను అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని