తరుణ్‌ బ్యాంకు లావాదేవీలపై ఆరా

ప్రధానాంశాలు

తరుణ్‌ బ్యాంకు లావాదేవీలపై ఆరా

ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో సినీనటుడు తరుణ్‌ను దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి వచ్చిన తరుణ్‌ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. బుధవారంతో మత్తుమందుల కేసులో సినీ ప్రముఖుల విచారణ ముగిసింది. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో నిధుల మళ్లింపు అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేసింది. 2017లోనూ ఆబ్కారీ అధికారులు తరుణ్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ వాంగ్మూలం ఆధారంగా ఆయనను పిలిపించారు. ఇదే కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు మరోమారు విచారించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. తరుణ్‌ ఒకప్పుడు పబ్‌ నిర్వహించేవారన్న ప్రచారం నేపథ్యంలో దానికి సంబంధించిన లావాదేవీల వివరాలనూ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆబ్కారీ విచారణలో తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయాన్ని తరుణ్‌ ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. తాము కేవలం బ్యాంకు లావాదేవీలపైనే దృష్టి కేంద్రీకరించామని అధికారులు చెప్పినట్లు సమాచారం. అపరిచితులతో గాని, అనధికారికంగా గాని తాను లావాదేవీలు నిర్వహించలేదని, కెల్విన్‌ ఎవరో తనకు తెలియదని తరుణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని