దసరా నవరాత్రుల్లో రోజుకు 10 వేల మందికే దుర్గమ్మ దర్శనం

ప్రధానాంశాలు

దసరా నవరాత్రుల్లో రోజుకు 10 వేల మందికే దుర్గమ్మ దర్శనం

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రోత్సవాల్లో రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. అక్టోబరు 7 నుంచి 15వరకు దుర్గగుడిలో దసరా వేడుకలు జరగనున్నాయి. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని, దర్శన టికెట్లను ముందుగానే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భవానీ దీక్షలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ ఉండవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది కూడా కృష్ణా నదిలో స్నానాలకు అనుమతించట్లేదని తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్‌లో జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఆలయ ఛైర్మన్‌ పైలా సోమినాయుడు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని