4 పట్టణాభివృద్ధి సంస్థల పరిధి పెంపు

ప్రధానాంశాలు

4 పట్టణాభివృద్ధి సంస్థల పరిధి పెంపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల పరిధి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో యర్రవారిపాలెం మండలంలోని 12 గ్రామాలను చేర్చారు. దీంతో కొత్తగా 185.29 చదరపు కిలో మీటర్ల ప్రాంతం తుడా పరిధిలో చేరింది.

కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 15 మండలాల్లోని 129 గ్రామాలతో పాటు ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాల్టీలను కలిపారు. చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మూడు మండలాల్లో 48 గ్రామాలు చేరాయి. దీంతో చుడా పరిధిలో 662 చ.కిమీ ప్రాంతం కొత్తగా కలిసింది. పలమనేరు-కుప్పం-మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో కొత్తగా ఆరు మండలాలతోపాటు బి.కొత్తకోట నగర పంచాయతీని కలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని