రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు

 జ్వర పరీక్షల కిట్లూ తగినన్ని ఉన్నాం
వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మంగళగిరి: రాష్ట్రంలో కొవిడ్‌ దృష్ట్యా అదనంగా ఔషధాలను కొనుగోలు చేశామని, ఆస్పత్రుల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. డెంగీ, మలేరియా నిర్ధారణ పరీక్షలకు సరిపడా కిట్లు ఉన్నాయన్నారు. ఔషధ భాండాగారాల్లో కాలం తీరిన మందులు ఉంచుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎం.డి. మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావుతో కలిసి ఆయన మంగళగిరిలోని కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఔషధాల వినియోగంలో అత్యవసర పరిస్థితిని అనుసరించి కేటాయింపులు జరుపుతున్నాం. తక్కువ వినియోగం ఉన్నచోట నుంచి అవసరమైన చోటకు తరలిస్తున్నాం. క్యాన్సర్‌ చికిత్సలో వాడే మందులు అవసరానికి మించి ఉన్నాం. ఈ ఔషధి వెబ్‌సైట్‌లో సమస్యల్లేవు. దీన్ని ఉప ఆరోగ్య కేంద్రం వరకు విస్తరించాం. డెంగీలో ప్రస్తుతం వచ్చిన స్ట్రెయిన్‌ చాలా తీవ్రంగా ఉంది. పట్టణాల్లో ముఖ్యంగా 85% డెంగీ కేసులు గ్రేటర్‌ విశాఖ పరిధిలోనే ఉన్నాయి. మలేరియా కేసులు అంతగా లేవు. ప్రాంతీయ వైద్యశాలల్లోనూ ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాం. గుంటూరు సీడీఎస్‌లో మలేరియా నివారణ మందులు ఎక్కువగా ఉన్నాం. వైద్యారోగ్య శాఖలో కొత్తగా 14,200 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకరించారు’ అని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని