ఆయుష్‌ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ

ప్రధానాంశాలు

ఆయుష్‌ వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ

ఈనాడు, అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీకి ఉపక్రమించింది. ఆయుష్‌ విభాగంలో ఖాళీగా 72 ఆయుర్వేద, 53 హోమియో, 26 యునానీ మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటనలు జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 4 నుంచి ప్రారంభమవుతుంది. అదే నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సిలబస్‌, ఇతర వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చునని కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. జోన్ల వారీగా ఈ పోస్టులు భర్తీచేయనున్నారు.

* ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల్లో 13 క్యారీ ఫార్వర్డ్‌,  59 రెగ్యులర్‌ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్‌ పోస్టుల్లో 4 ఈడబ్ల్యూఎస్‌ కోటాకు చెందినవి.

* హోమియోపతి మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల్లో 1 క్యారీ ఫార్వర్డ్‌. మిగిలిన పోస్టులు రెగ్యులర్‌. ఇందులో 4 ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఉన్నాయి. ః యునానీ మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల్లో 21 క్యారీ ఫార్వర్డ్‌. మిగిలిన పోస్టులను రెగ్యులర్‌ కోటాలో భర్తీచేయనున్నారు. ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఉంది.

*అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచినట్లు కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ గురువారం జీవో జారీచేసిందని పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్‌ కింద అర్హత సాధించే అభ్యర్థులు బయోడేటాలోని తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కార్యదర్శి సూచించారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో అవకాశాన్ని కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌, జులై నెలల్లో విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ఆమోద ఉత్తర్వులననుసరించి దశల వారీగా ప్రకటనలు ఇస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని