100% కొత్తవారే!

ప్రధానాంశాలు

100% కొత్తవారే!

మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
పదవి పోయినా భయపడనని, తనకు పార్టీ ముఖ్యమని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వందశాతం కొత్త వారికి చోటు ఉంటుందని విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మంత్రివర్గాన్ని వంద శాతం మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. మంచిది సర్‌! నాకు అభ్యంతరం లేదన్నాను. పార్టీ విధానపరమైన నిర్ణయమైతే కచ్చితంగా మార్చండి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాను.

ఈ క్రమంలో మంత్రి పదవి పోయినా భయపడను. నాకు పార్టీయే ముఖ్యం’ అని బాలినేని స్పష్టం చేశారు. నేతలంతా కలిసి పనిచేయాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయం స్పష్టం చేశారన్నారు. పదవుల కోసం ఒకరిపై ఒకరు చెప్పుకోకూడదని నేతలకు సూచించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం జరగదని, సరైన సమయంలో మంచి అవకాశాలు వస్తాయన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని