భారత్‌ బంద్‌కు ప్రభుత్వ మద్దతు

ప్రధానాంశాలు

భారత్‌ బంద్‌కు ప్రభుత్వ మద్దతు

మంత్రి పేర్ని నాని వెల్లడి

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌కు రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా గమనించాలని కోరారు. 27వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యథావిధిగా బస్సులు తిరుగుతాయని వెల్లడించారు. బంద్‌లో పాల్గొనే ప్రజలు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయాలని సూచించారు. శనివారం మచిలీపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. చట్టాలతో వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని విమర్శిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్‌ రంగానికి విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని