కడప జైల్లో నిందితుల గుర్తింపు ప్రదర్శన

ప్రధానాంశాలు

కడప జైల్లో నిందితుల గుర్తింపు ప్రదర్శన

వివేకా హత్య కేసు విచారణ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో భాగంగా శనివారం కడప జైల్లో ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ను నిర్వహించారు. జమ్మలమడుగు న్యాయమూర్తి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సీబీఐ అధికారులు వాచ్‌మెన్‌ రంగన్నను జైలుకు తీసుకొచ్చారు. జైల్లో రిమాండులో ఉన్న నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని న్యాయమూర్తి సమక్షంలో రంగన్నకు చూపించారు. హత్య జరిగిన రాత్రి ఇద్దరు వ్యక్తులను చూసినట్లు గతంలో రంగన్న చెప్పడంతో ఆ ఇద్దరిలో ఉమాశంకర్‌రెడ్డి ఉన్నారా లేరా అని గుర్తించేందుకు ఈ పరేడ్‌ చేపట్టారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని