కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు

ప్రధానాంశాలు

కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు

అసమ్మతికి తావులేకుండా తగిన జాగ్రత్తలు
దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన మంత్రులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించారు. మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికల్లో సొంత పార్టీలో ఎంపీటీసీ సభ్యుల నుంచి అసమ్మతి తలెత్తడంతో జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక సజావుగా సాగేలా మంత్రులు జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అధిష్ఠానం బి.ఫారం జారీ చేసిన జడ్పీటీసీ సభ్యులకు మిగిలిన వారు మద్దతు ఇచ్చేలా మంత్రులు ఒప్పించారు. దీంతో 13 జిల్లాల్లోనూ అధిష్ఠానం నిర్ణయించిన వ్యక్తులే జడ్పీ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్ల పదవులకు ఎక్కువ మంది పోటీపడిన చోట కూడా జిల్లా మంత్రులు జోక్యం చేసుకున్నారు. ఉదయం 10 గంటల తరువాత ఇద్దరు కో-ఆప్షన్‌ ఎన్నికలను కలెక్టర్లు ప్రారంభించి 12.30 కల్లా పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. చేతులెత్తే పద్ధతిలో 20 నుంచి 30 నిమిషాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల పదవీకాలం శనివారం నుంచి ప్రారంభమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని