నేడు, రేపు కూడా వర్షాలు

ప్రధానాంశాలు

నేడు, రేపు కూడా వర్షాలు

ఈనాడు, అమరావతి: ‘తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్‌ తుపాను.. సోమవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ నుంచి పశ్చిమ దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది’ అని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీనితోపాటు దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం మీదుగా ఉన్న రుతుపవనద్రోణి ప్రభావంతో మంగళ బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని