11 రాష్ట్రాల్లో వ్యవసాయరంగంలో కొంత పురోగతి

ప్రధానాంశాలు

11 రాష్ట్రాల్లో వ్యవసాయరంగంలో కొంత పురోగతి

3, 4 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌చంద్‌ విశ్లేషణ

ఈనాడు, దిల్లీ: దేశంలో గత పదేళ్లలో వ్యవసాయరంగ పురోగతిని విశ్లేషిస్తే కేవలం 11 రాష్ట్రాల్లోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేష్‌చంద్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం దేశ వ్యవసాయరంగ పురోగతిపై రూపొందించిన విశ్లేషణ పత్రాన్ని ఆయన విడుదల చేశారు. దీని ప్రకారం 2011-12 నుంచి 2019-20 మధ్యకాలంలో కేవలం 11 రాష్ట్రాల్లోనే 3%కి మించిన సగటు వృద్ధి రేటు నమోదైందని, ఇందులో మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయని చెప్పారు. ‘10 రాష్ట్రాల్లో వ్యవసాయవృద్ధి -3.63% నుంచి 1%కి పరిమితమవగా... మరో 8 రాష్ట్రాల్లో అది 1.05% నుంచి 2.96% మధ్య నమోదైంది. మిగిలిన 11 రాష్ట్రాల్లో 3.38% నుంచి 6.87%మేర కనిపించింది.  రైతు ఆదాయంలో పంటల వాటా 2011-12లో 65.4% మేర ఉండగా... 2018-19 నాటికి అది 55.3%కి పడిపోయింది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన తొలి 15 ఏళ్లలో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధి రేటు 4.28% మేర నమోదవగా... గత 15ఏళ్లలో ఆ మూడు పంటల సగటు వృద్ధి 2.37%కి పరిమితమైంది. జొన్న, సజ్జ, రాగి, ఇతర చిరుధాన్యాల వృద్ధిరేటు 2.38% నుంచి -1.94%కి పడిపోయింది. పప్పుగింజల వృద్ధి రేటు తగ్గి గత 15 ఏళ్లలో పెరిగింది. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపల ఉత్పత్తి మంచి వృద్ధి రేటును నమోదు చేశాయి. నూనెగింజలు 1991 నుంచి పడిపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది...’ అని ఆయన వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని