‘పాలమూరు-రంగారెడ్డి’పై అక్టోబరు1 లోగా నివేదికలివ్వండి: ఎన్జీటీ

ప్రధానాంశాలు

‘పాలమూరు-రంగారెడ్డి’పై అక్టోబరు1 లోగా నివేదికలివ్వండి: ఎన్జీటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై నివేదిక సమర్పణలో కేంద్ర పర్యావరణ శాఖ నాన్చుడు ధోరణిపై చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలయాపన సరికాదని హెచ్చరించింది. జులైలో నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం నిర్హేతుకమని పేర్కొంది. అక్టోబరు 1వ తేదీ కల్లా మధ్యంతర నివేదికలు సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణ శాఖతోపాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందంటూ ఏపీకి చెందిన రైతు చంద్రమౌళీశ్వరరెడ్డి పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని