మున్నాకు నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి

ప్రధానాంశాలు

మున్నాకు నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి

దస్తగిరిని విచారించిన సీబీఐ

కడప నేరవార్తలు, పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న పులివెందులకు చెందిన చెప్పుల దుకాణ యజమాని మున్నాకు నార్కో పరీక్షలు చేయించేందుకు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. నార్కో పరీక్షలకు మేజిస్ట్రేట్‌ ఎదుట మున్నా అంగీకారం తెలపడంతో సీబీఐ అధికారులకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. గత ఏడాది మున్నాకు చెందిన రూ.45 లక్షల నగదును బ్యాంకు లాకరులో సీబీఐ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మాజీ డ్రైవర్‌ దస్తగిరిని విచారించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని