కనులపండువగా సర్వభూపాల వాహనసేవ

ప్రధానాంశాలు

కనులపండువగా సర్వభూపాల వాహనసేవ

తిరుమలలో నేడు చక్రస్నానం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 7.35 నుంచి 9గంటల వరకు శ్రీవారి రథోత్సవానికి ప్రతిగా శ్రీ మలయప్పస్వామి దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కొలువుదీరారు. రాత్రి ఆశ్వ వాహనంపై దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఈ ఘట్టం ఉదయం 8 నుంచి 11గంటల మధ్య నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9గంటల మధ్య జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

* తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని 13 జిల్లాలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల నుంచి పేదప్రజలను తిరుమలకు ఉచితంగా తీసుకువచ్చి తితిదే దర్శనం కల్పించింది. ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎనిమిది రోజుల్లో 7,350 మందికి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించారు. తితిదే, సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని