ఏపీ, ఒడిశా వైపుగా అల్పపీడనం

ప్రధానాంశాలు

ఏపీ, ఒడిశా వైపుగా అల్పపీడనం

ఈనాడు, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆ పరిసర ప్రాంతాల మీదుగా గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉన్నట్లు  శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారానికి పశ్చిమ వాయవ్యంగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుందని వివరించారు. ఫలితంగా శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని