విశాఖ మహిళకు ‘డెంటన్స్‌’లో కీలక పదవి

ప్రధానాంశాలు

విశాఖ మహిళకు ‘డెంటన్స్‌’లో కీలక పదవి

ఈటీవీ, విశాఖపట్నం:  ప్రపంచంలో అతిపెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన ‘డెంటన్స్‌’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా విశాఖకు చెందిన నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ తరహా కంపెనీలో గ్లోబల్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా పదవి దక్కడం ఇదే తొలిసారి. నీలిమ పాలడుగు ప్రస్తుతం అమెరికాలోని డెల్లాయిట్‌ కంపెనీలో ‘గ్లోబల్‌ పీపుల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌’గా పని చేస్తున్నారు. 205కి పైగా దేశాలలో విస్తరించిన డెంటన్స్‌లో నవంబరు 15న చేరనున్నారు. నీలిమ రాకతో తమ వాణిజ్య కార్యకలాపాలలో మానవ వనరుల నిర్వహణ వ్యూహాలు మరింత పటిష్ఠంగా అమలవుతాయని డెంటన్స్‌ గ్లోబల్‌ సీఈవో ఎల్లైట్‌ పోర్టోని వ్యాఖ్యానించారు. నీలిమ తల్లిదండ్రులు ఉప్పలపాటి సాయిరాణి, రాజా. భర్త సుధాకర్‌ పాలడుగు. కుమార్తె రియా, కుమారుడు సునీల్‌. నీలిమ విశాఖలోని కొటక్‌ పాఠశాలలో పది, సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశారు. మెరిల్‌లించ్‌,  పీడబ్ల్యూసీ, ఐబీఎం వంటి కంపెనీలలో మానవ వనరుల విభాగంలో పనిచేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని