దేవరగట్టులో కొనసాగిన కర్రల సమరం

ప్రధానాంశాలు

దేవరగట్టులో కొనసాగిన కర్రల సమరం

వందమందికిపైగా గాయాలు

హాలహర్వి, ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో మరోసారి రక్తం చిందింది. ఏటా విజయదశమి రోజు జరిగే బన్ని ఉత్సవంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు ఒకచేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలతో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు, పల్లకిని గట్టు పైనుంచి కిందకు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం నెరణికి, ఆలూరు, నెరణికితండా, బిలేహాల్‌, కొత్తపేట, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం (బన్ని ఉత్సవం) సాగింది. ఈ సందర్భంగా కర్రలు తగిలి కొందరు, కాగడాలు తగిలి, తొక్కిసలాటలో మరికొందరు భక్తులు గాయపడ్డారు. దాదాపు వంద మందికిపైగా గాయాలయ్యాయి. 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆలూరు, ఆదోని, కర్నూలు, బళ్లారి ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. స్వల్ప గాయాలు అయినవారికి స్థానిక శిబిరంలో వైద్యసేవలు అందించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని