శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ప్రధానాంశాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

తిరుమల, న్యూస్‌టుడే: తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన  తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. రాత్రి 7గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలో గరుడ పతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలను ముగించారు. ఉదయం ఆలయంలోని ఐనామహల్‌ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఐనామహల్‌ ముఖమండప ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్నపుష్కరిణిలో ఉదయం 10 గంటలకు సుదర్శనచక్రాన్ని పవిత్రపుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు. కొవిడ్‌ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం శ్రీవారి అంతరాలయంలో ఏకాంతంగా తితిదే నిర్వహించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని