కొవాగ్జిన్‌పై 26న డబ్ల్యూహెచ్‌వో కమిటీ భేటీ

ప్రధానాంశాలు

కొవాగ్జిన్‌పై 26న డబ్ల్యూహెచ్‌వో కమిటీ భేటీ

జెనీవా: భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ లిస్టింగ్‌(ఈయూఎల్‌)లో చేర్చే విషయమై చర్చించేందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సాంకేతిక సలహా కమిటీ అక్టోబర్‌ 26న సమావేశం కానుంది. డబ్ల్యూహెచ్‌వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ ఆదివారం ఓ ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో పరిశీలనార్థం భారత్‌ బయోటెక్‌ వారు అందించిన వివరాలు తమ నిపుణులు పరిశీలిస్తున్నారని, వారం రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. అత్యవసర వినియోగ వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు టీకాలను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని