హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ప్రమాణం

ప్రధానాంశాలు

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ప్రమాణం

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర.. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీతో ప్రమాణం చేయించారు. బదిలీకి సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌ భానుమతి చదివి వినిపించారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీకి న్యాయమూర్తులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ 1969 ఫిబ్రవరి 9న జన్మించారు. 2019 డిసెంబర్‌ 12న అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ తిల్హరీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని