ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం: ఎమ్మెల్యే బాలకృష్ణ

ప్రధానాంశాలు

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం: ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: కమీషన్లు తీసుకొని సొంత ఖజానా నింపుకోవటం మినహా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టడం లేదని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. రక్తనిధి కేంద్రంలో నిల్వలున్నప్పటికీ అత్యవసర సమయంలో రక్తం ఇవ్వటంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కేంద్రం సిబ్బందిపై మండిపడ్డారు. సీటీస్కాన్‌ యంత్రాన్ని రెండేళ్లనుంచి బాగు చేయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కరోనాను నిర్ధారించే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేసే పరికరాలకు సంబంధించిన బిల్లు సదరు కంపెనీకి చెల్లించనందున మూడు నెలలుగా ఆసుపత్రిలో వృథాగా ఉంచటంపై విస్మయం వ్యక్తం చేశారు. బసవతారక మాతాశిశు కేంద్రాన్ని పరిశీలించి తల్లీబిడ్డలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని, ఉన్నవారు అంకితభావంతో పనిచేస్తుంటే వారిపై రాజకీయ ఒత్తిడి తెస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని