అవకతవకలపై ఆధారాలు ఇవ్వండి!

ప్రధానాంశాలు

అవకతవకలపై ఆధారాలు ఇవ్వండి!

జేఎన్‌టీయూ కాకినాడలో మరోసారి విచారణ
రుజువులు కోరుతున్న కొత్త కమిటీ

ఈనాడు, అమరావతి: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడలో ఆటోమెషిన్‌ కాంట్రాక్టు అప్పగింతలో జరిగిన అవకతవకలపై ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు కమిటీ విచారణ చేపట్టింది. పరీక్షల విధానం, ఈ-అభ్యసన, మదింపు, నియామకాల కంప్యూటరీకరణ (ఆటోమెషిన్‌) టెండర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. పనుల అప్పగింత, ఈ-టెండర్‌ నిబంధనల ఉల్లంఘన, చెల్లింపుల్లో ఆదాయ పన్ను మినహాయించకపోవడం, పాలకవర్గం అనుమతి లేకపోవడం వంటి తప్పిదాలు జరిగినట్లు తేల్చింది. ఈ అక్రమాలపై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే కమిటీకి సమర్పించాలని కోరింది. ఈనెల 26 లోపు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 3 కమిటీలు అక్రమాలు జరిగినట్లు గుర్తించగా.. పూర్తిస్థాయి నివేదిక కోసం తాజాగా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆటోమెషిన్‌ కోసం జేఎన్‌టీయూ కాకినాడ 2012-13లో టెండర్లు నిర్వహించింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.268 కోట్లు. పనులు గ్లోబరిన అనే సంస్థకు అప్పగించింది. ఇప్పటి వరకు రూ.19.92 కోట్లు చెల్లించింది. టెండర్ల విధానం, నిబంధనల ఉల్లంఘనపై అప్పట్లో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ప్రొఫెసర్‌ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చినా.. లోపాలు ఉన్నాయంటూ నిలిపివేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్‌ రంగయ్య అధ్యక్షతన మరో కమిటీ, దీంతోపాటు విజిలెన్స్‌ కమిటీ విచారణ జరిపింది. ఈ నివేదికలూ సరిగా లేవంటూ చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కొత్తగా ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈనెల 23 నుంచి 26 వరకు విశ్వవిద్యాలయంలో విచారణ చేపట్టనుంది.

చర్యలకు అవకాశం ఏది ?

యూజీసీ నిబంధనల్లోనూ స్పష్టత లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో వీసీలుగా వ్యవహరించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని