అమిత్‌ షాకు చంద్రబాబు ఫిర్యాదు

ప్రధానాంశాలు

అమిత్‌ షాకు చంద్రబాబు ఫిర్యాదు

తెదేపా కార్యాలయాలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి
హామీ ఇచ్చిన కేంద్ర హోం మంత్రి

ఈనాడు డిజిటల్‌- అమరావతి: తెదేపా కేంద్ర, జిల్లా కార్యాలయాల మీద దాడులపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెదేపా కార్యాలయాలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. వైకాపా మూకలు తెదేపా కార్యాలయాలపై దాడులకు దిగి, కార్యకర్తలను భౌతికంగా గాయపరిచాయని చెప్పారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని వివరించారు. ఈ దాడులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేసినవేనని చెప్పారు. దీనిపై అమిత్‌ షా బదులిస్తూ.. దాడి ఘటనను పరిశీలిస్తామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెదేపా కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తామని హామీనిచ్చినట్లు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

గవర్నర్‌తో మాట్లాడిన చంద్రబాబు

ఈ ఘటనలపై చంద్రబాబు.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఫోన్లో మాట్లాడారు. అధికార పార్టీ రాష్ట్రంలో దాడులకు దిగుతోందని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వైకాపా ముఠాలు కర్రలు, రాడ్లతో వచ్చి కార్యకర్తలపై దాడులకు దిగాయని చెప్పారు. ఫర్నీచరు, కిటికీలు ధ్వంసమయ్యాయని, మీడియాపైనా దాడి చేశారని, పక్కకు తోసేసి ఫోన్లు దొంగిలించారని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని