పీఎమ్‌ కేర్స్‌కు డిసెంబరు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

ప్రధానాంశాలు

పీఎమ్‌ కేర్స్‌కు డిసెంబరు 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఈ పథకం కింద అనాథ చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల సాయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు ఉద్దేశించిన పీఎమ్‌ కేర్స్‌ పథకానికి అర్హుల నుంచి ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. అర్హులైన వారి పేరు మీద ఈ పథకం కింద కేంద్రం రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేస్తుందని వెల్లడించారు. ఇలాంటి చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల సాయానికి ఇది అదనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత తీసుకునే అవకాశం కల్పించగా...కేంద్రం ఇచ్చే మొత్తాన్ని 23 ఏళ్లు నిండిన తర్వాత తీసుకునే వీలుందని వివరించారు. గత ఏడాది మార్చి 11 తర్వాత కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్లలోపు చిన్నారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని