ఎగువ సీలేరులో విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి

ప్రధానాంశాలు

ఎగువ సీలేరులో విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి

ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌

ఈనాడు, అమరావతి: ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్డ్‌ స్టోరేజ్‌ జల విద్యుత్తు ప్రాజెక్టు (పీఎస్‌పీ) ఏర్పాటుకు జెన్‌కోకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రిడ్‌ స్థిరీకరణకు పీఎస్‌పీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ‘ఎగువ ఉన్న గుంటవాడ రిజర్వాయర్‌ నుంచి 1.70 టీఎంసీల నీరు దిగువ ఉన్న డొంకరాయి రిజర్వాయర్‌కు చేరుతుంది. దీనివల్ల పీక్‌ డిమాండ్‌ సమయంలో చౌక విద్యుత్తు గ్రిడ్‌కు అందుతుంది. ఆఫ్‌ పీక్‌ సమయంలో దిగువ రిజర్వాయర్‌లో నీటిని మళ్లీ ఎగువకు తీసుకెళ్తాం. మరోవైపు థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి పెంచేలా బొగ్గు కొరతను అధిగమించడానికి సింగరేణి, కోల్‌ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు. పీఎస్‌పీ ఏర్పాటుకు 410 హెక్టార్ల భూమి అవసరమని జెన్‌కో ఎండీ శ్రీధర్‌ పేర్కొన్నారు. డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని