ఏపీ లాసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ప్రధానాంశాలు

ఏపీ లాసెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

తిరుపతి(మహిళా వర్సిటీ), కానూరు, న్యూస్‌టుడే: ఏపీ లాసెట్‌-2021 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, మహిళా వర్సిటీ వీసీ ఆచార్య జమున గురువారం తిరుపతిలో విడుదల చేశారు. ప్రవేశ పరీక్షను గతనెల 22న మహిళా వర్సిటీ నిర్వహించింది. రెండు, మూడు, ఐదేళ్ల కోర్సులకు 12,854 మంది పరీక్ష రాయగా 11,495 (89.5%) మంది అర్హత సాధించారు. మూడు కోర్సుల్లోనూ అమ్మాయిలు 50శాతానికిపైగా అర్హత సాధించారు. ఐదేళ్ల కోర్సులో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన ఎం.మౌనికబాయి, రెండేళ్ల కోర్సులో విశాఖపట్నం శివాజీపాలెంకు చెందిన వై.గీతిక ప్రథమ ర్యాంకులు సాధించారు. మూడేళ్ల కోర్సులో విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన ఎం.హరిప్రియ మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. విద్యుత్తు శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. హరిప్రియ భర్త రవీంద్రబాబు కూడా 53 ఏళ్ల వయసులోనే గతేడాది లాసెట్‌లో ప్రథమ ర్యాంకు పొందారు. కార్యక్రమంలో లాసెట్‌ కన్వీనర్‌ చంద్రకళ, రెక్టార్‌ శారద], రిజిస్ట్రార్‌ మమత పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని