కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక

ప్రధానాంశాలు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుక

డీఏ 3% పెంపు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తీపి కబురు. జులై నుంచి వర్తించేలా ప్రభుత్వం కరవు భత్యాన్ని (డీఏ) 3% పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం  జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో మొత్తం కరవు భత్యం 31 శాతానికి చేరుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.9,488.74 కోట్ల అదనపు భారం పడనుంది. 47.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని