వివేకా హత్య కేసులో దస్తగిరికి ముందస్తు బెయిలు

ప్రధానాంశాలు

వివేకా హత్య కేసులో దస్తగిరికి ముందస్తు బెయిలు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన వివేకా మాజీ డ్రైవర్‌, పులివెందులకు చెందిన దస్తగిరికి కడప నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు శుక్రవారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రెండు నెలల కిందట సీబీఐ అధికారులు దస్తగిరిని ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. తనను అరెస్టు చేస్తారనే భయంతో దస్తగిరి నాలుగు రోజుల కిందట కడప నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో ముందస్తు బెయిలుకు పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో న్యాయమూర్తి ముందస్తు బెయిలు మంజూరు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని