సమంత పరువు నష్టం కేసును విచారణకు స్వీకరించిన కోర్టు

ప్రధానాంశాలు

సమంత పరువు నష్టం కేసును విచారణకు స్వీకరించిన కోర్టు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సినీ నటి సమంత వేసిన పరువునష్టం దావా కేసును హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ విచారణార్హతపై శుక్రవారం వాదనలు జరిగాయి. తన క్లయింట్‌ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరఫు న్యాయవాది  వై.బాలాజీ వివరించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, సమంత, నాగచైతన్యకు విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవి ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగిస్తాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి, ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని