ప్రతి కేసుకు.. దాడికి బదులు చెబుతాం

ప్రధానాంశాలు

ప్రతి కేసుకు.. దాడికి బదులు చెబుతాం

తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తమ పార్టీ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. ఏ స్థాయిలో వేధించినా.. ప్రతి ఒక్క దానికీ బదులు చెబుతామని, వడ్డీ సహా చెల్లిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా గూండాలు మారణాయుధాలతో తెగబడినా పట్టించుకోని పోలీసులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారంటూ తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టడం నీతిమాలిన చర్య’ అని శనివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘తెదేపా రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్‌ మహదేవ్‌ అక్రమ అరెస్టు దుర్మార్గం. అరెస్టు చేసి ఆచూకీ చెప్పకుండా ఆయన్ను వేర్వేరు ప్రాంతాలకు తిప్పడం దారుణం. సందీప్‌పై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సీఎం జగన్‌ గుర్తుంచుకోవాలి. తక్షణమే ఆయనను విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెడితే అరెస్టు చేస్తారా అని స్వయంగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం ప్రతి పౌరునికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం.. అరెస్టుచేసి ఆచూకీ చెప్పకుండా తిప్పడం దుర్మార్గం’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని